స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -31 లో.. నర్మద వాళ్ల నాన్న ప్రసాదరావు ఇంటికి భద్రవతి వెళ్లి.. నీ కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందని చెప్తుంది. దాంతో పెళ్లి వాళ్లు ప్రసాదరావుని తిట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రసాదరావు కోపంగా నర్మద దగ్గరికి బయలుదేర్తాడు. మరొకవైపు కళ్యాణ్ ప్రేమ కోసం వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే ప్రేమ రాగానే నిన్ను ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానంటూ బైక్ ఎక్కించుకొని వెళ్తాడు.
అప్పుడే ప్రేమ ఫ్రెండ్ తనకి ఫోన్ చేసి.. ధీరజ్ ఎక్కడున్నాడో తెలిసిందనగానే కళ్యాణ్ బైక్ ఆపు ఆ దీరజ్ గాడు ఎక్కడున్నాడో తెలిసింది పద అంటుంది. ఎందుకు అలా అని కళ్యాణ్ అనగానే.. వాడెప్పుడు నన్ను ఏడిపిస్తాడు కదా.. ఇప్పుడు వాడిని ఇంట్లో నుండి గెంటేసారు. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో చూడాలని ప్రేమ అనగానే.. ఇక తప్పక సరే అంటాడు కళ్యాణ్. మరొకవైపు ప్రసాదరావు నర్మద దగ్గరికి వచ్చి తిడతాడు. నర్మదని వాళ్ళ అమ్మ కొడుతుంటే.. అత్తయ్య గారు ఆపండి అని సాగర్ అంటాడు. నువ్వు మధ్యలో రాకని సాగర్ తో నర్మద వాళ్ళ అమ్మ అంటుంది.
ఆ తర్వాత ఇదేనా పెంపకమంటూ రామరాజుని ప్రసాదరావు తిడతాడు. దాంతో నాన్న మా ఆయనని మా మావయ్య గారిని ఏం అనకు.. అదే మాట పెంపకం ఇదేనా అని అడిగితే ఏం చేస్తావ్ అది ఈ ఇంటి సంస్కారమని నర్మద అనగానే ప్రసాదరావు కోప్పడి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనతో పాటు రామరాజుకి ఇంకొక శత్రువు అయ్యాడని భద్రావతి, సేనాపతి లు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు నర్మదకి ఆకలి అవుతుంది. సాగర్ ని పిలిస్తే తను సైలెంట్ గా ఉంటాడు. తరువాయి భాగంలో ఈ ఇంటిని ముక్కలు చెయ్యాలి అనుకుంటున్నారా అని నర్మద, సాగర్ లని రామరాజు ఇంట్లో నుండి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.